బ్యాకప్ తిరిగిపొందు

ఒకవేళ మీరు మీ ఫైళ్ళలో కొన్ని కొల్పోయి లేదా తొలగించి వుండి, వాటిని బ్యాకప్ నందు కలిగివుంటే, మీరు వాటిని బ్యాకప్ నుండి తిరిగిపొందవచ్చు.

  • బాహ్య హార్డుడ్రైవర్, USB పరికరం లేదా నెట్వర్కు నందలి వేరొక కంప్యూటర్ నుండి మీరు మీ బ్యాకప్ తిరిగిపొందాలని అనుకుంటే, మీరు వాటిని తిరిగి మీ కంప్యూటర్‌కు నకలు తీయవచ్చు.

  • మీరు మీ బ్యాకప్‌ను Déjà Dup వంటి బ్యాకప్ అనువర్తనం వుపయోగించి సృష్టించితే, మీ బ్యాకప్ తిరిగివుంచుటకు మీరు తిరిగి అదే అనువర్తనం వుపయోగించమని సిఫార్సు చేయడమైంది. మీ బ్యాకప్ ప్రోగ్రామ్ కొరకు అనువర్తనం సహాయం పునఃపరిశీలించండి: మీ ఫైళ్ళను తిరిగి ఎలా పొందాలో అది సూచనలను ఇస్తుంది.