బ్యాకప్స్ తరచుదనం
ఎంత తరచుగా మీరు బ్యాకప్స్ తీయాలి అనేది మీరు ఏ రకమైన దత్తాంశం బ్యాకప్ తీద్దామని అనుకుంటున్నారో దానిపై ఆదారపడి వుటుంది. ఉదాహరణకు, మీరు ముఖ్యమైన దత్తాంశం కలిగివున్న సేవికలు గల నెట్వర్కు వాతావరణం కలిగివుంటే, రోజుకోసారి బ్యాకప్స్ కూడా సరిపోవు.
అలాగే, మీరు మీ ఇంటి కంప్యూటర్ నందలి దత్తాంశం బ్యాకప్ తీస్తుంటే అప్పుడు గంటకోసారి బ్యాకప్స్ అనవసరం. మీ బ్యాకప్ ప్రణాళికను ఎలా రూపొందించాలి అనేదానికి కింది సూచనలు సహాయకంగా వుండవచ్చు:
మీ కంప్యూటర్ పైన గడిపే సమయం.
కంప్యూటర్ పైని దత్తాంశం ఎంత తరచుగా ఎంత మేరకు మారుతుంది.
మీరు బ్యాకప్ తీద్దామనుకొన్న దత్తాంశం తక్కువ ప్రాముఖ్యతను కలిగివుంటే, లేదా కొద్దిపాటి మార్పులు, సంగీతం, ఈ-మెయిల్స్ మరియు ఇంట్లో ఫొటోలు లాంటివి అయితే, వారంకోసారి లేదా నెలకోసారి బ్యాకప్ సరిపోతుంది. మీరు పన్ను లెక్కల మధ్యలో వుంటే, మరింత తరచుగా బ్యాకప్‌లు తీయుట అవసరం.
సాధారణంగా, బ్యాకప్ల మధ్యని సమయం అనునది మీరు కోల్పోయిన పనిని తిరిగిచేయుటకు వెచ్చించాల్సిన సమయం కన్నా ఎక్కువ వుండరాదు. ఉదాహరణకు, పోయిన పత్రములను తిరిగి వ్రాయుటకు మీకు వారం సమయం మరీ ఎక్కువ అయితే, మీరు వారానికోసారి బ్యాకప్ తీసుకోవాలి.