రంగు స్పేస్ అనగా ఏమి?

రంగు స్పేస్ అనునది రంగుల విస్తృతిని నిర్వచించును. బాగా తెలిసిన రంగు స్పేసెస్ sRGB, AdobeRGB మరియు ProPhotoRGB చేర్చును.

మనిషి దృష్టి వ్యవస్థ మామూలు RGB సెన్సార్ కాదు, అయితే మనిషి చూపును గుర్రపు-నాడా ఆకారం వలె చూపే CIE 1931 క్రొమాటిసిటీ డయాగ్రమ్‌తో కన్ను స్పందించేదానికి దగ్గరగా చేయగలం. మానవ దృష్టి నీలం లేదా ఎరుపుకన్నా చాలా ఛాయల ఆకుపచ్చ గుర్తించినట్లు మీరు చూడవచ్చు. RGB వంటి ట్రైక్రోమాటిక్ కలర్ స్పేస్ తో మనం మూడు విలువలు వుపయోగించి కంప్యూటర్‌పై రంగులు చూడవచ్చు, రంగుల త్రిభుజం ఎన్కోడింగ్ వరకు దీనిని నిర్భందించవచ్చు.

CIE 1931 క్రోమాటిసిటీ డయాగ్రమ్ వంటి మోడళ్ళను వుపయోగించుట మానవ దృష్టి వ్యవస్థ యొక్క సరళీకరణం, వాస్తవ గామట్స్ అనునవి 2D ప్రొజెక్షన్స్ కన్నా, 3D హల్స్ గా వ్యక్తపరచబడును. 3D ఆకారం యొక్క 2D ప్రొజెక్షన్ కొన్నిసార్లు తప్పుదోవ పట్టించును, కనుక మీరు 3D పూర్తిగా చూడవలెనంటే, gcm-viewer అనువర్తనం వుపయోగించు.

sRGB, AdobeRGB మరియు ProPhotoRGB అనునవి తెల్ల త్రిభుజాలచే ప్రస్పుటించబడును

ముందుగా, sRGB వద్ద చూచును, అది చిన్న జాగా మరియు తక్కువ సంఖ్యలో రంగులను ఎన్కోడ్ చేయగలదు. ఇది 10 సంవత్సరాల పాత CRT ప్రదర్శనకు దాదాపుగా వుంటుంది, మరియు కొత్త మానిటర్లు చాలావరకు దీనకన్నా చాలా రంగులను సళువుగా ప్రదర్శించగలవు. sRGB అనునది లీస్ట్-కామన్-డినామినేటర్ ప్రమాణం మరియు చాలా అనువర్తనాలు (ఇంటర్నెట్‌తో సహా) నందు వుపయోగించెను.

AdobeRGB అనునది ఎడిటింగ్ స్పేస్ వలె తరచుగా వుపయోగించబడెను. ఇది sRGB కన్నా చాలా రంగులను ఎన్కోడ్ చేయగలదు, దీనర్ధం vivid రంగులు క్లిప్ చేయబడతాయి లేదా నలుపులు నొక్కివేయబడతాయి అనే విచారం లేకుండా మీరు ఫొటోగ్రాఫ్ నందలి రంగులను మార్చవచ్చు.

ప్రొఫొటో నందు చాలా జాగా వుంది మరియు పత్రము ఆర్కైవల్ కొరకు తరచుగా వాడుతారు. ఇది మనిషి కంటిచే గుర్తించబడు దాదాపు అన్ని రంగులను ఎన్కోడ్ చేయగలదు, మరియు కంన్ను గుర్తించలేని రంగులను కూడా ఎన్కోడ్ చేయగలదు!

Now, if ProPhoto is clearly better, why don’t we use it for everything? The answer is to do with quantization. If you only have 8 bits (256 levels) to encode each channel, then a larger range is going to have bigger steps between each value.

పెద్ద అంచెలు అనగా పట్టిన రంగుకు మరియు నిల్వవున్న రంగు మద్యన పెద్ద దోషం అని, మరియు కొన్ని రంగులకు ఇది పెద్ద సమస్య. ఇది కీ రంగులకు, శరీర రంగులు వంటివాటికి చాలా ముఖ్యం, మరియు కొద్దిపాటి దోషాల మూలాన అంతగా అవగాహనలేని వీక్షకులు కూడా ఫొటోగ్రాఫ్ నందు ఏదో తప్పుందని గుర్తిస్తారు.

16 బిట్ చిత్రం వుపయోగించుటవలన చాలా అంచెలను మరియు చిన్న క్వాంటైజేషన్ దోషం విడుచును, అయితే ఇది ప్రతి చిత్ర ఫైలు పరిమాణంను రెట్టింపుచేయును. ఈ రోజున చాలా కాంటెంట్ 8bpp నందు వుంది, అనగా ఒక్కో పిగ్జెల్‌కు 8 బిట్స్.

రంగు నిర్వహణ అనగా ఒక రంగు స్పేస్ నుండి వేరొక రంగు స్పేస్‌కు మార్చే ప్రోసెస్, ఇచట రంగు స్పేస్ అనునది బాగాతెలిసిన నిర్వచిత స్పేస్ sRGB వలె, లేదా మీ మానిటర్ లేదా ముద్రకం ప్రొఫైల్ వలె మలచిన స్పేస్.